రజనీకాంత్.. ఈ పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. ఆయన నడిచొచ్చే విధానం, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకుల్ని తెరకు లీనమయ్యేలా చేస్తాయి. సూపర్ స్టార్ సినిమా అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు. ఈరోజు రజనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాల్లోని డైలాగ్స్‌ను ఓసారి గుర్తుచేసుకుందాం.
- ఆడదంటే అనుకువుగా ఉండాలి.. తొందర పడకూడదు. చదువు ఉండాలి సంస్కారం మరిచి పోకూడదు. అధికారం ఉండా,లి అహంకారం ఉండకూడదు. క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. భయభక్తులు ఉండాలి, బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- నా జన్మ విరోధినైనా క్షమిస్తానేమో కాని వెంటే ఉండి వెన్ను పోటు పొడిచే వారిని అసలు క్షమించను.
- మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖ పడొచ్చు కానీ ఓడిపోతాడు. భాషా మానిక్ భాషా .. ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.
- నాన్న పందులే గుంపులుగా వస్తాయ్... సింహం సింగిల్‌గా వస్తుంది
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం.. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి. నేను ఎవరి దారికి అడ్డు రాను నా దారికి అడ్డు వచ్చారో.. అర్థమయ్యిందిగా నా దారి రహదారి అడ్డురాకండి.
- బాబాయ్ .. ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో కష్ట పడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.
- నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు. ఎవడి తప్పు వాడిదే ఎవడి ఒప్పు వాడిదే. న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఆపరా.. అంతకు మించి ఒక్కమాట మాట్లాడితే నాలుక చీరేస్తా.. నా కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటానికి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా... ప్రాణాలు తీస్తా. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది.. నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా నాకు కావాల్సింది.. నాకు కావాల్సింది జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తియ్యరా తాళి, కట్టరా వెళ్లి.
- ఒక్కసారి తప్పుచేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే..
- శిష్యా కొంత మంది చెబితే వింటారు కొంతమంది అనుభవం అయితే వింటారు. కొంతమందిని తన్తేనే వింటారు. మీ నలుగుర్ని తన్తేనే వింటారని దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తాడు.
- సార్ వాళ్లకి చెప్పండి. పోలీసుల దగ్గరికి లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్లో రావొచ్చు. కానీ స్ట్రయిట్‌గా రావొద్దని.