పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయంపై రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అలా సూపర్ స్టార్ రజనీ కాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
"దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలు నన్ను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏ సమస్యకైనా హింస, అల్లర్లు పరిష్కారం కాకూడదు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలి. దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి."
రజనీకాంత్, సినీ నటుడు
ప్రస్తుతం ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. 'షేమ్ ఆన్ యు సంగి రజని' అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. మరోవైపు రజనీకాంత్‌కు మద్దతుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరు 'ఐ స్టాండ్ విత్ రజనీకాంత్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతుదారుల హ్యాష్‌ట్యాగ్ దేశంలో తొలి స్థానంలో ఉంది.