రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రాజ్‌దూత్'. నక్షత్ర హీరోయిన్గా చేస్తోంది. అర్జున్-కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
"ఒక అందమైన ఊరు, అందులో ఓ అద్భుతమైన షెడ్డు, దాంట్లో.. పని చెయ్యని రేడియో, తిరగలేని టైరు, సౌండు చెయ్యని సైలెన్సరు, బాడీ లేని హెడ్ లైట్, వీటన్నిటి మధ్యలో.. తిరుగులేని నేను".. అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమా మొత్తం రాజ్‌దూత్ అనే బైక్ చుట్టూ తిరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్ విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. అల్లు-త్రివిక్రమ్ సినిమాలో చిత్రలహరి హీరోయిన్