ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి. రాజశేఖర్ ఆరోగ్యంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారినపడిన ఆయన ఇటీవలే ఆస్పత్రిలో చేరారు.
"రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారు."
--రత్నకిశోర్, సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్.
ఆసుపత్రి నుంచి ప్రకటన వెలువడకముందు ఆయన చిన్న కుమార్తె శివాత్మిక సామాజిక మాధ్యమాల్లో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది. కొవిడ్ నుంచి కోలుకునేందుకు నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారని పేర్కొంది. కరోనా నుంచి నాన్న వేగంగా కొలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. శివాత్మక ప్రకటనతో రాజశేఖర్ ఆరోగ్యంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మరోమారు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ... రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.