రేపు హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సందడి చేయనుంది. దర్శకుడు రాజమౌళి ఈ చిత్ర విశేషాలు తెలియజేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి హీరోలిద్దరూ హాజరు కానున్నారు.
బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు జక్కన్న. ఆ చిత్రం అనంతరం వస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బందీపోటుగా జూనియర్ ఎన్టీఆర్, పోలీస్‌గా రామ్‌చరణ్ నటిస్తున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. రేపటితో ఈ వార్తలకు సమాధానం దొరకనుంది. కథానాయికగా అలియా భట్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనా స్పష్టత వచ్చే అవకాశముంది.