ETV Bharat / sitara

Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే ముందే రాజమౌళి నుంచి సర్​ప్రైజ్! - రాజమౌళి లేటేస్ట్ న్యూస్

'ఆర్ఆర్ఆర్'(RRR) కంటే ముందే దర్శకుడు రాజమౌళి(Rajamouli).. సినీ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అది ఏంటంటే?

Rajamouli To do a short film on corona awareness
రాజమౌళి
author img

By

Published : Jun 6, 2021, 5:49 PM IST

స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అంటే మనకు 'బాహుబలి'(Bahubali) లాంటి భారీ బడ్జెట్​ సినిమానే గుర్తొస్తుంది. ప్రస్తుతం ఆయన 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉండగా, కరోనా(Corona) కారణంగా ఈ చిత్ర షూటింగ్​ ఆగిపోయింది. సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతుండటం, రాష్ట్రాలు పలు అంశాల్లో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో త్వరలో చిత్రీకరణ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అంతకంటే ముందే మరో సర్​ప్రైజ్​తో ప్రేక్షకులను పలకరించనున్నారు రాజమౌళి.

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ తిరిగే ప్రారంభించేందుకు మరికొద్దిరోజులు పట్టేలా ఉంది. కాబట్టి ఆ విరామంలో కరోనాపై అవగాహనలో భాగంగా ఓ షార్ట్​ఫిల్మ్ తీసే యోచనలో రాజమౌళి అండ్ టీమ్ ఉంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ఓ పోలీస్ అధికారి, తన బాధ్యతను ఎలా నిర్వర్తించారు అనే కథతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు!

'ఆర్ఆర్ఆర్' విడుదల ఈ అక్టోబరు 13 అని చెబుతున్నప్పటికీ, అదికాస్త వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపైనా త్వరలో చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.