ETV Bharat / sitara

'భవిష్యత్తు పరిస్థితులను సవాలుగా స్వీకరిస్తా' - ఓటీటీ గురించి మాట్లాడిన రాజమౌళఇ

లాక్​డౌన్​ తర్వాత దర్శకులు తీయబోయే సినిమాలు.. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను మించి ఉండాలని అన్నారు దర్శకుడు రాజమౌళి. అప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని అన్నారు.

rajamouli
రాజమౌళి
author img

By

Published : May 8, 2020, 6:58 AM IST

"లాక్‌డౌన్‌ తర్వాత చిత్ర పరిశ్రమలో మార్పులు ఉంటాయి. సినిమాను నదితో పోలిస్తే..అది ప్రస్తుతం దారి మార్చుకుంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా కథల విషయంలో మార్పు చూపించాలి" అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా ప్రభావం సినిమాపై ఎలా ఉండబోతుందనే అంశంపై ఓ వెబినార్‌ జరిగింది. అందులో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకులు రాజమౌళి, నాగ్‌ అశ్విన్‌, నిర్మాత డి.సురేష్‌బాబు పాల్గొన్నారు.

"థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారా లేదా అనేది ఇప్పుడేం చెప్పలేం. ఒకవేళ వచ్చినా ఈలోపు డిజిటల్‌ మాధ్యమాలకి అలవాటుపడతారు. ప్రపంచ సినిమాను రుచి చూస్తారు. దీంతో ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను మించి సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు ఆదిరిస్తారు. నాకు సవాళ్లు అంటే ఇష్టం. కరోనా తర్వాత రానున్న పరిస్థితులను సవాల్‌గా తీసుకొని మరింతగా ప్రేక్షకుల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తాను. ఓ హీరో పరిచయ సన్నివేశాన్ని వందలాది ప్రేక్షకుల మధ్యలో చూస్తేనే బాగుంటుంది. ఇంట్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని చూస్తే ఆ అనుభూతి ఉండదు. కరోనా తర్వాత రాబోయే మార్పుల్లో ముందుగా ఆలోచించాల్సింది బడ్జెట్‌ గురించి. ముందు లగ్జరీలు తగ్గించుకోవాలి. దీంతో పారితోషికాలు తగ్గుతాయి. తద్వారా సినిమా బడ్జెట్‌ తగ్గుతుంది. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుంటారనుకుంటున్నా. కరోనా తర్వాత ఎక్కువ దృష్టిపెట్టాల్సిన అంశం చిత్రీకరణలు. ఎక్కువమంది నటులతో షూటింగులు చేయడం కష్టం. మరీ అవసరమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయం తీసుకుని పూర్తి చేయడమే మంచిది"

-రాజమౌళి, దర్శకుడు.

"లాక్‌డౌన్‌ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగులు మొదలుపెట్టాలి"అన్నారు సురేష్‌బాబు. నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ "కరోనా తర్వాత కథల విషయంలో పెద్దగా మార్పులు ఉండవు. ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. ప్రేక్షకుణ్ని నిరాశపర్చకుండా సినిమా చూపిస్తే చాలు"అన్నారు.

ఇదీ చూడండి : 'ఆ పాత్రల వల్ల నన్ను చూసి తెగ భయపడేవారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.