ETV Bharat / sitara

మహేశ్​ సినిమాలో బాలయ్య.. జక్కన్న క్లారిటీ! - రాజమౌళి మహేశ్ సినిమా

Maheshbabu Balakrishna Rajamouli: మహేశ్​బాబు-రాజమౌళి సినిమాలో బాలకృష్ణ నటించనున్నారనే వార్త కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించారు జక్కన్న. ఆయన ఏం చెప్పారంటే..

maheshbalayya
మహేశ్ బాలయ్య
author img

By

Published : Mar 19, 2022, 3:51 PM IST

Maheshbabu Balakrishna Rajamouli: త్వరలోనే 'ఆర్​ఆర్​ఆర్'​తో అభిమానులను పలకరించనున్న దర్శకుడు రాజమౌళి తన తదుపరి సినిమాను మహేశ్​బాబుతో తెరకెక్కించనున్నారు. అయితే ఇది మల్టీస్టారర్​ చిత్రమని, ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా నటిస్తారని ప్రచారం సాగింది. తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు జక్కన్న. ఈ మూవీ సింగిల్​ హీరో ఫిల్మ్​ అని చెప్పారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్స్​లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కోసం నేడు బెంగళూరు వెళ్లిన మూవీటీం ఓ మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే జక్కన్న. మహేశ్​ మూవీపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా పలు విశేషాల గురించి మాట్లాడారు.

కాగా, మహేశ్​ సినిమా అడవి నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్‌ మూవీ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో పోరాట సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేశ్​ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' మార్చి 25న విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్​'కు సర్కారు గుడ్​న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు ఓకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.