ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'జార్జ్ రెడ్డి'. ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులను తలపించేలా కళా దర్శకుడు గాంధీ నేతృత్వంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సెట్‌ను తీర్చిదిద్దారు. లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 10 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. అందులోనే చిత్రీకరణ జరిపారు.
ఆ ఉస్మానియా సెట్‌ను సందర్శించిన దర్శకధీరుడు రాజమౌళి.. కళా దర్శకుడు గాంధీని అభినందించాడు. ఒరిజినల్ ప్రదేశానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటం వల్ల ప్రేక్షకులు, నాటితరం విద్యార్థులు గాంధీ కళా ప్రతిభను మెచ్చుకుంటున్నారు. 'జార్జ్ రెడ్డి' చిత్రంలో ఆ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. అభిషేక్‌తో షారుఖ్.. అధికారిక ప్రకటన