Stand Up Rahul Movie: రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన్ వీరంకి తెరకెక్కించారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. "మా రెండేళ్ల ప్రయాణం ఈ సినిమా. ఇందులో అలరించే వినోదంతో పాటు మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. దీంట్లో నా పాత్రకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ.. నా కుటుంబాన్ని చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేదే ఈ చిత్ర కథ"అన్నారు.
"ఈ చిత్రం నాకే కాదు.. మా టీమ్ మొత్తానికి మంచి గుర్తింపు తెస్తుంది. థియేటర్లో సినిమా చూసి ప్రేక్షకులు చిరునవ్వులతో బయటకొస్తారనే నమ్మకముంది" అంది నాయిక వర్ష బొల్లమ్మ. దర్శకుడు శాంటో మాట్లాడుతూ.. "నా జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నా. సినిమా వాళ్లకు, బ్యాచిలర్స్‌కు హైదరాబాద్‌లో ఇల్లు దొరకడం కష్టం. ఇవి సినిమాలో హీరో పాత్రతో చెప్పించాను. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరాయి" అన్నారు.
"ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం. రాజ్‌తరుణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు" అన్నారు నిర్మాతలు.
ఇదీ చూడండి: RRR Movie: బాహుబలిని మించి 'ఆర్ఆర్ఆర్'.. తారక్, చరణే ఎందుకంటే?