టాలీవుడ్ కథానాయకుడు రాజ్‌తరుణ్ కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. 'గుండెజారి గల్లంతయ్యిందే'తో ఆకట్టుకున్న కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మిగతా నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆగస్టు నుంచి రెగ్యూలర్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
" ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. రాజ్ తరుణ్‌కి ఇది చాలా మంచి చిత్రమవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది” -కొండా విజయ్‌కుమార్, దర్శకుడు
ఇది చదవండి: 'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్‌తరుణ్