పోర్న్ రాకెట్ కేసు(RajKundra news) దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టిని ఆరు గంటలపాటు విచారించారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని శిల్పా ఇంటికి చేరుకున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కుంద్రాకు చెందిన వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శిల్పా.. గతేడాది రాజీనామా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు, రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్ సంస్థ పోర్న్ రాకెట్‌లో కీలకంగా మారింది. ఇటీవల ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు 21 టీబీ పోర్న్ వీడియోలు గుర్తించి సీజ్ చేశారు.
అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారే సమాచారంతో ముంబయిలోని ఓ బంగ్లాపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ క్రమంలో 'పోర్న్ రాకెట్'లో కీలకంగా ఉన్న రాజ్‌కుంద్రాను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న అతను మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించగా.. విచారణ అనంతరం కోర్టు జులై 27 వరకూ కస్టడీని పొడిగించింది.
ఇదీ చూడండి: 'పేదరికాన్ని వీడాలని.. ధనవంతుడిగా ఎదగాలని..'