ETV Bharat / sitara

'సినిమా క్లైమాక్స్​ చూస్తే ఏడుపొచ్చింది'

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత, శర్వానంద్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జాను'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో విజయోత్సవాన్ని నిర్వహించింది చిత్రబృందం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు.. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమకథ చూసినట్లు తెలిపారు.

raghavendra rao attend as a chief guest to the jaanu success meet program and said a few words about movie
'సినిమాల్లోకి వచ్చాక అమ్మాయిలే అమ్మాయిలు'
author img

By

Published : Feb 10, 2020, 8:04 AM IST

Updated : Feb 29, 2020, 7:58 PM IST

శర్వానంద్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'జాను'. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఇటీవల విడుదలైన చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు విచ్చేశారు. చాలా కాలం తర్వాత ఓ మంచి ప్రేమకథ చూసినట్లు తెలిపారు.

"శర్వా, సమంత పోటీ పడి నటించారు. క్లైమాక్స్‌ చూస్తే ఏడుపొచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ తమ స్కూలు రోజులు గుర్తొస్తాయి. నా కాలేజీ, స్కూలు జీవితాల్లో అమ్మాయిలే లేరు. సినిమాల్లోకి వచ్చాక అమ్మాయిలే.. అమ్మాయిలు."( చమత్కారంగా)

కె. రాఘవేంద్ర రావు, దర్శకుడు

సమంత, శర్వానంద్​ల నటన అందరినీ కదిలిస్తోందని, ప్రేక్షకులు థియోటర్ల నుంచి బరువెక్కిన హృదయాలతో బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. 'జాను' మూవీని 'గీతాంజలి', 'పదహారేళ్ల వయసు' చిత్రాలతో రాఘవేంద్రరావు పోల్చడం చాలా గర్వంగా అనిపించిందని హీరో శర్వానంద్​ అన్నాడు. తన జీవితంలో గుర్తుండిపోయే సినిమా 'జాను' అని తెలిపాడు.

Last Updated : Feb 29, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.