కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులకు ఎప్పుడూ గుర్తుంటాడు. తాజాగా ఇతడు ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే దగ్గర ప్రార్థనలు చేసుకునేలా ఓ ఆలయం నిర్మించనున్నట్లు తెలిపాడు. తాజాగా శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- — Raghava Lawrence (@offl_Lawrence) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Raghava Lawrence (@offl_Lawrence) March 2, 2020
">— Raghava Lawrence (@offl_Lawrence) March 2, 2020
కోటిన్నరతో ఇళ్ల నిర్మాణం..
లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లు కట్టించేందుకు ప్రణాళికనూ రచించాడీ స్టార్ దర్శకుడు. అయితే ఈ మంచిపని కోసం ఇటీవల భారీ విరాళం అందించాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. దాదాపు రూ.1.5 కోట్ల సాయం చేశాడు. ఈ ట్రస్ట్ పేరుతో విద్య, చిన్నారుల కోసం వసతిగృహాలు, అంతేకాకుండా దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలూ నిర్వహిస్తున్నాడు లారెన్స్.
-
@akshaykumar pic.twitter.com/1PE6hvLwQk
— Raghava Lawrence (@offl_Lawrence) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">@akshaykumar pic.twitter.com/1PE6hvLwQk
— Raghava Lawrence (@offl_Lawrence) March 1, 2020@akshaykumar pic.twitter.com/1PE6hvLwQk
— Raghava Lawrence (@offl_Lawrence) March 1, 2020
ప్రస్తుతం ఇతడు 'కాంచన' హిందీ రీమేక్ 'లక్ష్మీ బాంబ్'ను తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లుగా అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ నటిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.