నటీమణులు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేం కాదు. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ సెంటర్లు ప్రారంభించారు. కాజల్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు.. శ్రియ బ్యూటీపార్లర్‌లు నడుపుతున్నారు. ఇలా ఓ పక్క నటిస్తూనే మరోపక్క వ్యాపారంలోనూ సంపాదిస్తున్నారు. కాగా తను కూడా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నట్లు రాధికా ఆప్టే తెలిపారు. రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగుపెట్టాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించి.. నటనకు దూరం కావాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఏదో ఒకరోజు కచ్చితంగా తన కల నెరవేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ కాలాన్ని రాధికా ఆప్టే సద్వినియోగం చేసుకుంటున్నారు. కొన్ని కథలు రాసినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లుగా బిజీగా ఉన్నానని.. లాక్‌డౌన్ వల్ల తన కోసం సమయం కేటాయించుకునే అవకాశం దక్కిందని అన్నారు. రాధికా ఆప్టే ఇటీవల మెగాఫోన్ పట్టారు. దర్శకురాలిగా మారి 'ది స్లీప్‌వాకర్స్' లఘు చిత్రాన్ని తీశారు. ఇటీవల దీని టీజర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "దర్శకురాలిగా ఉండటం నాకు ఎంతో నచ్చింది. నేను తీసిన లఘుచిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని ఉంది. దర్శకురాలిగా నా భవిష్యత్తు కొనసాగుతుందని ఆశిస్తున్నా. చూద్దాం.." అని అన్నారు. రాధికా ఆప్టే 'రక్తచరిత్ర', 'రక్తచరిత్ర 2', 'ధోనీ', 'లెజెండ్', 'లయన్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.