ETV Bharat / sitara

శివరాత్రి స్పెషల్- 'రాధేశ్యామ్​' కొత్త​ పోస్టర్​ - రాధేశ్యామ్​ శివరాత్రి స్పెషల్ పోస్టర్​

ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న 'రాధేశ్యామ్'​ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్​ను శివరాత్రి కానుకగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

radheshyam
రాధేశ్యామ్
author img

By

Published : Mar 11, 2021, 8:54 AM IST

దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి లవర్​బాయ్​గా ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రేమకథా సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. తాజాగా శివరాత్రిని పురస్కరించుకుని ఈ చిత్ర​బృందం సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్​ను వివిధ భాషల్లో విడుదల చేసింది. ఇందులో ప్రభాస్​, పూజాహెగ్డే లుక్​ ఆకట్టుకునేలా ఉంది.

70ల నాటి ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌, హిందీ వెర్షన్‌కు మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీతం అందించనున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 30న సినిమా విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.