అందం, అభినయంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక రాశి. చాలారోజుల తర్వాత మరోసారి తెరపై కనిపించబోతుంది. లైట్హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కుమార్తెగా నందితా శ్వేత నటించనుంది.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభిమైందీ సినిమా. నటులు అశోక్ కుమార్, పోసాని కృష్ణమురళి, నిర్మాత సి.కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఇది చదవండి: శ్రీకారం సినిమాలో హీరో శర్వానంద్ రైతు పాత్రలో..!