యువహీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. ఈ చిత్రంలోని ఓ కథానాయిక రాశీఖన్నా.. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది.
"నేను డబ్బింగ్ చెప్తున్న నా తొలి చిత్రమిది. నా గాత్రం, ఉచ్చరణ పాత్రకు నప్పుతాయో లేదోననే భయం ఉండేది. కానీ, పూర్తయిన తర్వాత నేనే నమ్మలేకపోయాను. మీరు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురుచూడటం నా వల్ల కాదు" -ట్విట్టర్లో రాశీఖన్నా
ఇప్పటి వరకు పాత్రకు గాత్రం అందించకపోయినా.. 'జోరు' సినిమాలో ఓ పాట పాడి అందరిని అలరించింది రాశీఖన్నా.
'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఐశ్వర్య రాజేశ్, క్యాథరీన్, ఇస్బెల్లా మిగతా హీరోయిన్లు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.