నటి రాయ్‌లక్ష్మీ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటికి ఫుల్స్టాప్ పెట్టిందీ భామ. స్వయంగా తానే సామాజిక మాధ్యమాల వేదికగా పెళ్లి గురించి ప్రస్తావించింది. ఈ నెల 27న నిశ్చితార్థం జరగనున్నట్లు వెల్లడించింది.
"చాలా కాలంగా చాలా మంది నన్ను ఈ విషయంపై ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే ఈ వార్తలకు ముగింపు పలకాలి అనుకుంటున్నా. ముందుగా నేను నా రిలేషన్ షిప్ గురించి ఏమీ దాచట్లేదు. అయితే దాని గురించి వేరే వాళ్లకు అనవసరం. నాకంటూ స్వేచ్ఛ కావాలి అనుకున్నా. అందుకే నా పార్ట్రన్కు సంబంధించిన విషయాలు బయటపెట్టట్లేదు. ఈ నెల 27న మా నిశ్చితార్థం జరగనుంది. ఇప్పటికే కొందరు స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంపాం. ఇది అనుకోకుండా జరిగినా.. మా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. నా భాగస్వామితో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ పోస్ట్ పెట్టింది రాయ్ లక్ష్మీ.
2005లో విడుదలైన 'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాయ్ లక్ష్మీ. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించింది.