ETV Bharat / sitara

'పుష్ప' ట్రైలర్ రిలీజ్ డేట్.. 'స్పైడర్​మ్యాన్' ఒకరోజు ముందే

author img

By

Published : Nov 29, 2021, 11:53 AM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, సమ్మతమే, స్పైడర్​మ్యాన్: నో వే హోమ్, బీస్ట్, 83 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప

*'పుష్ప' ట్రైలర్​ రిలీజ్ ఎప్పుడు చేస్తారో ప్రకటించారు. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల ఇప్పుడు నుంచే కౌంట్​డౌన్ మొదలుపెట్టేశారు.

allu arjun pushpa movie
'పుష్ప' రిలీజ్ డేట్

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్​ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించారు.

*'స్పైడర్​మ్యాన్: నో వే హోమ్' సినిమా.. చెప్పిన తేదీ కంటే ఓ రోజు ముందే మనదేశంలో రిలీజ్ కానుందని వెల్లడించారు. దీంతో డిసెంబరు 17న కాకుండా డిసెంబరు 16న థియేటర్లలోకి చిత్రం రానుంది.

spider man no way home movie
స్పైడర్​మ్యాన్: నో వే హోమ్ మూవీ

జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్​ పాత్ర కూడా ఉంది. ఈ చిత్రంలోని పలు కీలకపాత్రలు ఇందులో కనిపించాయి. అలానే ఈ సినిమాలో ముగ్గురు 'స్పైడర్​మ్యాన్'లు ఒకే సీన్​లో కనిపించనున్నారనే అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

*కిరణ్ అబ్బవరం-చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సమ్మతమే'. ఈ చిత్రంలోని 'కృష్ణ అండ్ సత్యభామ' లిరికల్​ వీడియో సోమవారం రిలీజైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరెకక్కుతున్న ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతమందించగా, కనకాల ప్రవీణ నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

*విజయ్-పూజా హెగ్డే 'బీస్ట్' సినిమా 100 రోజుల షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని వెల్లడించిన దర్శకుడు ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ డ్రమ్స్ వాయిస్తుండగా, పాడుతూ పూజా హెగ్డే కనిపిస్తుంది. దర్శకుడు నెలన్స్ దిలీప్​ కుమార్ గిటార్​ ప్లే చేస్తూ దర్శనమిచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

beast movie vijay pooja hegde
బీస్ట్ మూవీ షూటింగ్​లో

*1983 ప్రపంచకప్​ ఆధారంగా తీస్తున్న సినిమా '83'. ఈ చిత్ర ట్రైలర్​ను మంగళవారం(నవంబరు 30) రిలీజ్ చేయనున్నారు. ఇందులో కపిల్​దేవ్ పాత్రను రణ్​వీర్ సింగ్, అతడి భార్యగా దీపికా పదుకొణె నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మి విర్క్, తాహిర్ బాసిన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కబీర్​ ఖాన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 24న ఈ సినిమాను థియేటర్లలోకి రానుంది.

83 movie
83 మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.