ETV Bharat / sitara

పుష్ప 'అన్​స్టాపబుల్' ఎపిసోడ్​కు టైమ్​ ఫిక్స్ - cinema news

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'అన్​స్టాపబుల్' కొత్త ఎపిసోడ్, సమంత 'యశోద', విశాల్ 'సామాన్యుడు', విజయ్ సేతుపతి 'మేరీ క్రిస్మస్' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

balayya allu arjun
బాలయ్య అల్లుఅర్జున్
author img

By

Published : Dec 25, 2021, 6:10 PM IST

Unstoppable With NBK: బాలయ్య 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' కొత్త ఎపిసోడ్​కు టైమ్​ ఫిక్సయింది. ఇందులో భాగంగా 'పుష్ప' హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ షోలో సందడి చేయనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఆహా ఓటీటీలో ఎపిసోడ్​ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన ఓ వీడియోలో బాలయ్య.. 'పుష్ప' మేనరిజంతో పాటు డైలాగ్​ కూడా చెప్పి ఫ్యాన్స్​ను ఆశ్చర్యపరచడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్లలో దుమ్ములేపుతున్న 'పుష్ప'.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక కథానాయిక. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ డైరెక్టర్.

Samantha yashoda movie: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. థ్రిల్లర్​ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్​ శనివారంతో పూర్తయింది.

samantha yasodha movie
సమంత యశోద

ఇందులో వరలక్ష్మి శరత్​కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, హరి-హరీశ్ ద్వయం డైరెక్షన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.

Vijay sethupathi katrina kaif: ఇటీవల పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్.. మళ్లీ పనిలో బిజీగా మారేందుకు సిద్ధమైంది. విజయ్ సేతుపతితో ఆమె కలిసి నటిస్తున్న కొత్త సినిమాను శనివారం ప్రకటించారు. 'మేరీ క్రిస్​మస్' టైటిల్​ను నిర్ణయించారు.

vijay sethupathi katrina kaif movie
విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ మూవీ

ముంబయిలో ఇప్పటికే షూటింగ్​ మొదలైన ఈ సినిమాకు 'అంధాధున్' ఫేమ్ రమణ్ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమేశ్ తౌరనీ, సంజయ్ రౌత్రే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్​ కానుకగా డిసెంబరు 23న రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

*విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'సామాన్యుడు: నాట్ ఓ కామన్​మ్యాన్'. ఈ చిత్ర టీజర్​ను శనివారం రిలీజ్ చేశారు. ఓ సామన్యుడికి.. రాక్షసుల్లాంటి వ్యక్తులకు జరిగే కథతో ఈ సినిమా తీశారు.

ఇందులో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్​గా చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించగా శరవణన్ దర్శకత్వం వహించారు. విశాల్ స్వయంగా నిర్మించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

sudigali sudheer gaalodu movie
సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.