ETV Bharat / sitara

'పుష్ప' ఆ ఓటీటీలోనే రిలీజ్.. ముంబయిలో 'ఆర్ఆర్ఆర్' ఈవెంట్ - Shyam singh roy pre release event

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, పుష్ప, శ్యామ్​సింగరాయ్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

pushpa RRR movie
పుష్ప ఆర్ఆర్ఆర్ మూవీస్
author img

By

Published : Dec 17, 2021, 3:46 PM IST

RRR event mumbai: 'పుష్ప' విడుదల సందర్భంగా ప్రచారానికి బ్రేక్​ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఇప్పుడు మరో ఈవెంట్​కు సిద్ధమైంది. డిసెంబరు 19న ముంబయిలో 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను రిలీజ్ చేశారు.

RRR mumbai event
ఆర్ఆర్ఆర్ ముంబయి ఈవెంట్ పోస్టర్

రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా ఈ సినిమాలో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ చిత్రం.

Pushpa OTT: అల్లు అర్జున్ 'పుష్ప' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్​ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 45-60 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

pushpa OTT release
పుష్ప మూవీ ఓటీటీ

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ హీరోగా నటించారు. రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Shyam singh roy movie: నేచురల్ స్టార్ నాని 'శ్యామ్​సింగరాయ్' రిలీజ్​ మరికొన్నిరోజులే ఉన్న నేపథ్యంలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్​లోని శిల్పాకళావేదికలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్​ను గ్రాండ్​గా ప్లాన్ చేశారు.

nani shyam singh roy movie
నాని శ్యామ్​సింగరాయ్ మూవీ

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానున్న ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 24న సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.