ETV Bharat / sitara

బాలయ్య-పూరీ జగన్నాథ్​ కాంబోలో మరో చిత్రం - పూరీ జగన్నాథ్​ బాలకృష్ణ

'పైసా వసూల్​' సినిమా తర్వాత కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna New Movie)- దర్శకుడు పూరీ జగన్నాథ్​ కాంబోలో మరో చిత్రం రూపొందనుంది. గోపీచంద్​ మలినేని, అనిల్​ రావిపూడి చిత్రాల తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

Puri Jagannadh to direct Nadamuri Balakrihsna after 'Liger'
బాలయ్య-పూరీ జగన్నాథ్​ కాంబోలో మరో చిత్రం
author img

By

Published : Jul 20, 2021, 7:31 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్‌' బాలయ్య మాస్‌ ఇమేజ్‌ను మరింత పెంచింది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరూ మరో సినిమా(Balakrishna New Movie) కోసం జట్టు కట్టబోతున్నారని కొంతకాలంగా వస్తున్న వార్తలపై బాలయ్య స్పందించారు. తన షెడ్యూల్‌లో పూరీ జగన్నాథ్​తో ఓ సినిమా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి 'ఆఖండ' తీర్చిదిద్దుతున్నారాయన. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తర్వాత గోపీచంద్‌ మలినేనితో కలిసి ఓ సినిమా(Balakrishna Movies) చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.

అయితే ఇటీవలే బాలకృష్ణ ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాతి ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు. అనిల్‌ రావిపూడితో ఓ సినిమా, దాని తర్వాత హరికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు. పూరీ జగన్నాథ్‌తో కలిసి ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు బాలయ్య చెప్పారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రస్తుతం 'లైగర్‌' పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు బాలయ్య సంతకం చేసిన సినిమాలన్నీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పూరీ-బాలయ్య ప్రాజెక్టు(Puri Jagannadh New Movie) కార్యరూపం దాల్చేందుకు కాస్త పట్టేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ'(Balakrishna Akhanda) దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పవర్‌ఫుల్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి.. Puri Jagannadh: పటాయా బీచ్​లో అది జరిగితే బాగుండు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.