ETV Bharat / sitara

'పునీత్‌.. ఆ కల నెరవేరకుండానే కన్నుమూశారు' - పునీత్​ రాజ్​కుమార్​

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్'​ సినిమాలో నటించాలని పునీత్​ రాజ్​కుమార్​ ఆశించినట్లు తెలిపారు దర్శకుడు మెహర్ రమేశ్​. ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారని విచారం వ్యక్తం చేశారు. పునీత్​తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.

puneeth
పునీత్​
author img

By

Published : Oct 30, 2021, 5:04 PM IST

తన చిరకాల కల నెరవేరకుండానే కన్నడ స్టార్‌ హీరో, పవర్‌స్టార్‌ పునీత్‌కుమార్‌ కన్నుమూశారని ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ అన్నారు. పునీత్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. నటుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పునీత్‌ వల్లే తన కెరీర్‌ మొదలైందని అన్నారు.

"పునీత్‌ నటించిన 'వీర కన్నడిగా' చిత్రంతోనే నేను దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాను. అనంతరం నా రెండో ప్రాజెక్ట్‌ 'అజయ్‌' కూడా ఆయనతోనే చేశాను. నన్ను తన ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ వాళ్ల ఇంటిలోనే భోజనం చేసేవాడిని. ఇటీవల 'భోళాశంకర్‌' ప్రకటించిన సమయంలో పునీత్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అభినందనలు చెప్పి.. 'చిరంజీవి సర్‌తో స్క్రీన్‌ పంచుకోవాలనేది నా కోరిక. మీరు ఛాన్స్‌ ఇస్తే ఈ సినిమాలో ఏదైనా అతిథి పాత్ర ఉంటే చేస్తాను. ఆఖరి పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తాను' అని అడిగారు. ఆ విషయాన్ని నేను చిరంజీవితో కూడా చెప్పాను. పునీత్‌ కోసం సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ రాయాలనుకున్నాను. అలాగే, నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలనుకున్నాను. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది" అని మెహర్‌ రమేశ్‌ వివరించారు.

శుక్రవారం(అక్టోబర్​ 29) ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచారు. ఆదివారం(అక్టోబర్​ 31) అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇదగీ చూడండి: ఆదివారం పునీత్​ రాజ్​కుమార్​ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.