కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) హఠాన్మరణం. ఈయన మృతి పట్ల కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న ఆయన (Puneeth Rajkumar)కు గుండె పోటు రావడంతో విక్రమ్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడి (Puneeth Rajkumar)గా అడుగుపెట్టినా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఎంతోమంది అభిమానుల్ని పొందిన పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. హైదరాబాద్ అభిమాని.

ఇటీవలె విడుదలైన ‘యువరత్న’ సినిమా ప్రమోషన్ కోసం నగరానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన చిత్రాల్లో ఎక్కువ శాతం రామోజీ ఫిలింసిటీలోనే చిత్రీకరించామని, తరచూ ఇక్కడికి వస్తుండటంతో భాగ్యనగరంలోని అన్నిరకాల వంటకాలు పరిచయమయ్యాయని పేర్కొన్నారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలతోపాటు బిర్యానీ, హలీమ్ రుచులంటే తనకెంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల ‘స్ట్రీట్ బైట్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్‌తో కలిసి చేసిన ఓ కార్యక్రమంలోనూ నగరానికి చెందిన ప్రముఖ హోటళ్లు, మిఠాయి కొట్ల నుంచి తెప్పించిన 20కిపైగా రుచుల్ని ఆస్వాదించారాయన. ఆయన మరణం వార్త తెలియగానే కన్నడిగులు స్థిరపడిన కాచిగూడ, బషీర్‌బాగ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పునీత్‌కు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు.
ఇదీ చూడండి: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం