యువనటి ఈశ్వరి దేశ్‌పాండే(Ishwari Deshpande News) రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. పుణెకు చెందిన ఈమె.. తన బాయ్‌ఫ్రెండ్ శుభమ్ దెడ్జేతో కలిసి వారం క్రితం గోవా వెళ్లింది. అక్కడ ఓ పార్టీకి వెళ్లి, తిరిగి వస్తుండగా.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు గోవాలోని కలన్‌గుటే వద్ద ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు బాగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఈశ్వరి(Ishwari Deshpande News), ఆమె బాయ్‌ఫ్రెండ్ శుభమ్ దెడ్గే అక్కడికక్కడే చనిపోయారు.
![ishwari deshpande](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13135876_cin.jpg)
ఈశ్వరి(Ishwari Deshpande Movies) ఇటీవల మరాఠీ, హిందీలో పలు చిత్రాల్లో నటించింది. ఈశ్వరి, శుభమ్.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మరికొద్ది నెలల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు.
ఇదీ చదవండి: వెంకటేశ్ షాకింగ్ లుక్.. రానాతో కలిసి వెబ్ సిరీస్