ETV Bharat / sitara

పవన్-క్రిష్ మూవీ ఫస్ట్​లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ - మహాశివరాత్రికి పవన్ క్రిష్ మూవీ ఫస్​లుక్

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​కు ముహూర్తం ఖరారు చేసింది చిత్రబృందం. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సినిమా అప్​డేట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

PSPK 27 Title
పవన్-క్రిష్ మూవీ ఫస్ట్​లుక్
author img

By

Published : Feb 24, 2021, 5:25 PM IST

Updated : Feb 24, 2021, 6:20 PM IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎ.ఎమ్‌.రత్నం నిర్మాత. ఈ సినిమా అప్​డేట్స్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా వారి నిరీక్షణ గుర్తించిన చిత్రబృందం అప్​డేట్​తో సిద్ధమైంది. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

పవన్‌ 27వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'విరూపాక్ష', 'హరహర మహాదేవ్', 'హరిహర వీరమల్లు' మొదలుకొని పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నిర్ణీత కాలంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్స్‌ని నిర్మించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ కీలక పాత్రని పోషిస్తోంది.

Last Updated : Feb 24, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.