ETV Bharat / sitara

'పవన్-హరీశ్ శంకర్ చిత్రంపై నిర్మాణ సంస్థ క్లారిటీ' - మైత్రీ మూవీ మేకర్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్​లుక్​పై ఓ అప్​డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ.

pspk 28
పవన్
author img

By

Published : Jun 8, 2021, 7:56 PM IST

దాదాపు రెండేళ్ల క్రితమే హరీశ్​ శంకర్​తో పవన్​ కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. 'గబ్బర్​సింగ్' కాంబో మరోసారి అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్​ పూర్తవగా, సెట్స్​పైకి వెళ్లేందుకు చాలా ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ విడుదలపై చాలా వార్తలు వచ్చాయి. నెట్టింట్లో పలు పోస్టర్​లూ సందడి చేశాయి. తాజాగా దీనిపై స్పందించింది నిర్మాణ సంస్థ. కరోనా కారణంగా ఫస్ట్​లుక్​కు ఇంకాస్త సమయం పడుతుందని వెల్లడించింది.

"ఉగాదికి మా సినిమా టైటిల్, ఫస్ట్​లుక్ విడుదల చేద్దామని భావించాం. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన చాలా లుక్​లు కనిపిస్తున్నాయి. కానీ సినిమాకు సంబంధించిన ఏ అధికారిక పోస్టర్, లుక్​ అయినా మా అధికారిక ఖాతా ద్వారానే వెల్లడిస్తాం. సరైన సమయంలో ప్రకటన చేస్తాం."

-మైత్రీ మూవీ మేకర్స్

ఇప్పటికే పవన్ కల్యాణ్​ క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', సాగర్ చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​లు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్​లు ముగిశాకే హరీశ్ శంకర్​తో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇవీ చూడండి: Chellam Sir: 'కరోనా సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.