ETV Bharat / sitara

ఒక్క సినిమా కోసం సల్మాన్​కు రూ.100 కోట్లు!

యశ్​​రాజ్​ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా తీయనున్న 'టైగర్' సిరీస్​ మూడో భాగం కోసం భారీ బడ్జెట్​ పెట్టనున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లు. ప్రస్తుతం స్క్రిప్ట్​ పనులు జరుగుతున్నాయి.

Producers allot Rs 300 cr for Salman Khan's Tiger 3
రూ.300 కోట్ల బడ్జెట్తో సల్మాన్ కొత్త చిత్రం!
author img

By

Published : Aug 6, 2020, 10:46 AM IST

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​.. 'టైగర్' సిరీస్​లో మూడో చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ నిర్మాణసంస్థ యశ్​రాజ్​ ఫిల్మ్స్​ తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్​ను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారట. ఇందులో కత్రినా కైఫ్​ కథానాయికగా నటించనుంది.

"టైగర్​' సిరీస్​లో మూడో చిత్రానికి బడ్జెట్​ రూ.200 కోట్ల నుంచి రూ.225 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సల్మాన్​ సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్​. ప్రింట్​, పబ్లిసిటీతో కలిపి మరో రూ.25 కోట్లు అవుతుంది. ఇందులో నటించేందుకే సల్మాన్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. యశ్​​రాజ్​ ఫిల్మ్స్​ సంస్థకు 'ధూమ్​'తో పాటు 'టైగర్​' కూడా అతిపెద్ద ఫ్రాంచైజీనే. వీటి నిర్మాణంలో యశ్​రాజ్​ అస్సలు రాజీ పడదు. 'టైగర్​ 3' కోసం 6-7 దేశాల స్టంట్​ నిపుణులు పనిచేయనున్నారు. దర్శకుడు ఆదిత్య చోప్రా, రచయితలతో స్క్రిప్ట్​ పనులు పూర్తి చేస్తున్నారు"

-బాలీవుడ్​ సినీ విశ్లేషకుడు

సల్మాన్​ ఖాన్​.. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే: యువర్​ మోస్ట్​ వాంటెడ్​ భాయ్​' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్​ చివరిదశకు చేరుకుంది. హీరోయిన్​గా దిశా పటానీ నటిస్తుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముంబయిలోని మెహబూబ్​ స్టూడియోలో షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.