ETV Bharat / sitara

సూర్య నిర్ణయం అభినందనీయం: అశ్వినీదత్

ప్రముఖ తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన చిత్రం 'సూరారై పొట్రు'. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. తాజాగా ఈ నిర్ణయాన్ని సమర్థించారు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్.

సూర్య నిర్ణయం అభినందనీయం: అశ్వినీదత్
సూర్య నిర్ణయం అభినందనీయం: అశ్వినీదత్
author img

By

Published : Aug 31, 2020, 10:03 AM IST

ప్రముఖ తమిళ నటుడు సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా' (త‌మిళంలో 'సూరారై పొట్రు'). సుధ కొంగ‌ర ద‌ర్శకత్వం వహించారు. ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ బయోపిక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. అయితే, సూర్యతో 'సింగం' సిరీస్‌ను రూపొందించిన దర్శకుడు హరి.. కథానాయకుడు సూర్యకు లేఖ రాశారు. ఓటీటీలో విడుదల అంశంపై పునరాలోచన చేయాలని సూచించారు. సూర్య నటించిన చిత్రాలను తెరపై చూస్తేనే బాగుంటుందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

దీనిపై ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ స్పందించారు. సూర్య తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయని, ఒకవేళ ఇప్పుడు తెరుచుకున్నా ప్రేక్షకులను రప్పించి వారిని కరోనాకు బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జనవరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదన్నారు. అందరూ థియేటర్లలోనే సినిమా చూడాలనడం సరికాదన్నారు. 'వి' చిత్రాన్నీ ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి అంగీకరించిన నాని నిర్ణయాన్ని అశ్వినీదత్‌ అభినందించారు. ఇంట్లో క్షేమంగా ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునేవాళ్లకు సూర్య, నాని ఓ మార్గం చూపారని ఇద్దరు కథానాయకులను ప్రశంసించారు. హరి సినిమాలకు తాను అభిమానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మనకు లేదన్న విషయాన్ని గ్రహించి సూర్య నిర్ణయానికి మద్దుతు తెలపాలని కోరారు.

ఈ చిత్రంలో అప‌ర్ణా బాల‌ముర‌ళి సూర్యకు జోడీగా నటించగా.. మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వశి, క‌రుణాస్ కీల‌క పాత్రలు పోషించారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య‌, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.