ETV Bharat / sitara

కేన్స్​ ఫెస్టివల్ జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక - Priyanka nick jonas cannes memories

హాలీవుడ్​ ప్రముఖ సింగర్​ నిక్​ జోనస్​తో వివాహం తర్వాత గతేడాది జరిగిన కేన్స్​ ఫిలిం ఫెస్టివల్​కు తొలిసారి హాజరైంది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా. ఆ కార్యక్రమంలోని జ్ఞాపకాలను తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది.

Priyanka Chopra reminisces fond memories of her 'first Cannes'
కేన్స్​ ఫిలింఫెస్టివల్ జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక
author img

By

Published : May 17, 2020, 1:05 PM IST

Updated : May 17, 2020, 6:25 PM IST

కరోనా ప్రభావంతో ఈ ఏడాది జూన్​లో జరగాల్సిన కేన్స్​ ఫిలిం ఫెస్టివల్ వాయిదా పడింది. ఈ వేడుకను వచ్చే సంవత్సరం ఏర్పాటు చేసే విషయాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. గతేడాది ఈ ఫెస్టివల్​కు మొదటిసారి హాజరైన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా.. దానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా పంచుకుంది.

ప్రియాంక.. తన భర్త నిక్​ జోనస్​తో కలిసి గతేడాది జరిగిన 72వ కేన్స్​ ఫిలిం ఫెస్టివల్​కు హాజరైంది. అప్పుడు తీసిన ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి తన సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసిందీ నటి. నిక్, ప్రియాంకల జంట రెడ్​ కార్పెట్​పై ఉన్న సమయంలో భయంకరమైన వర్షం కురిసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రియాంక, నిక్​ కలిసి ఫొటోలకు పోజులిస్తున్న క్రమంలో వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలో తన భార్య తడవడానికి నిక్​ ఇష్టపడలేదు. తన అందమైన తెల్ల గౌను తడవకుండా గొడుగుతో కాపాడాడు.

ఇదీ చూడండి.. 'లాక్​డౌన్​లో ప్రేమకు అర్థం తెలుసుకున్నా'

Last Updated : May 17, 2020, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.