ETV Bharat / sitara

కరోనా సూచనలు పాటించాలంటున్న ప్రియాంకా చోప్రా - కరోనా సూచనలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్​లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో పలువురు సినీనటులు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. స్వయంగా వారే సామాజిక మాధ్యమాల్లో లైవ్​లు, వీడియోలతో తమ సందేశాలను అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్​ నటి ప్రియాంకచోప్రా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ వైరస్​పై అవగాహన పెంచేందుకు ముందుకొచ్చింది.

Priyanka Chopra joins hands with WHO to spread awareness over COVID-19
కరోనా సూచనలు పాటించాలంటున్న ప్రియాంకా చోప్రా
author img

By

Published : Mar 19, 2020, 2:04 PM IST

మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు సినీతారలు ముందుకొస్తున్నారు. ఇటీవల 'ఆర్​ఆర్​ఆర్​' చిత్ర హీరోలు రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ఈ వైరస్​ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించగా ఇప్పుడు ఇదే బాటలో బాలీవుడ్​ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో కలిసి నేడు(గురువారం) తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా లైవ్​లో అవగాహన కల్పించనుంది.

వారూ నిర్బంధంలోనే..

ప్రియాంకా చోప్రా ఆమె భర్త నిక్​ జోనస్​ ఎనిమిది రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ వైరస్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు.

"కరోనా వైరస్​ గురించి పూర్తి సమాచారాన్ని ఆన్​లైన్​లోనే తెలుసుకున్నా. నాకు చాలా భయం వేసింది. ఇందులో ఎంత నిజం ఉందో అర్థం కాలేదు. అందుకే నేను ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నా. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఈ వైరస్​ను​ అందరూ కలిసి ఎదుర్కోవాల్సి ఉంది."

-ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

నటి ప్రియాంకా చోప్రాతో పాటు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ టెడ్రోస్​, మరియా వాన్ కెర్ఖోవ్, గ్లోబల్​ సిటిజన్ సీఈఓ హుగ్​ ఇవాన్స్​ లైవ్​లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: జాన్వీ, కియారాతో రొమాన్స్ చేస్తా: విజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.