ETV Bharat / sitara

ప్రియాంక 20 ఏళ్ల కెరీర్​ ఏడున్నర నిమిషాల వీడియోలో

author img

By

Published : Jul 4, 2020, 6:08 PM IST

తన 20 ఏళ్ల కెరీర్​ గురించి రూపొందించిన ఓ వీడియోను ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. ఇందులో ఆమెకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు.

ప్రియాంక 20 ఏళ్ల కెరీర్​ ఏడున్నర నిమిషాల వీడియోలో
ప్రియాంక చోప్రా

బాలీవుడ్​తో ప్రయాణం ప్రారంభించి, అంతర్జాతీయ ఖ్యాతినర్జించిన ప్రియాంక చోప్రా.. నటిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. సినీ పరిశ్రమతో సంబంధం లేని సాధారణమైన అమ్మాయి.. గ్లోబల్ ఐకాన్​గా ఎలా మారింది? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎలా తెచ్చుకుందో? తెలుపుతూ చేసిన ఓ వీడియోను ఈ సందర్భంగా ట్వీట్ చేసింది.

ఏరోనాటికల్ ఇంజినీర్ కావాలనుకున్న ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్​ రంగంలోకి అడుగుపెట్టింది. యుక్త వయసులోనే మిస్ ఇండియా, మిస్​ వరల్డ్​గా నిలిచి హిందీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్​ హోదా సంపాదించింది. ఆ తర్వాత యూఎస్​ టీవీ షో 'క్వాంటికో'తో అంతర్జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. యూనిసెఫ్ గుడ్​విల్ అంబాసిడర్​గానూ ప్రస్తుతం సేవలు అందిస్తోంది.

ప్రియాంక చోప్రా ఘనతలు

  • పీపుల్స్ ఛాయిస్ అవార్డు గెల్చుకున్న తొలి ఆసియా మహిళ
  • 50 మిలియన్ ఫాలోవర్లను అందుకున్న తొలి భారతీయ మహిళ
  • టీవీ షోల్లో అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటి
  • మెట్​ గాలా అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి ఇండియన్
  • అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​లో డేనీ కాయ్ హ్యుమనేటిరియన్ అవార్డు సొంతం

ప్రియాంక చోప్రా.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్​తో ఇటీవలే 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రానున్న రెండేళ్ల కాలానికిగాను పలు టీవీషోల్లో నటించడం సహా నిర్మించనుంది. దీనితో పాటే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.