మలయాళ నటి ప్రియావారియర్ చేసిన ఓ చిన్న తప్పు నెట్టింట వైరలవుతోంది. ఆమె ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు చర్చనీయాంశమయింది. ఓ ప్రైవేటు ప్రకటన కోసం తను ఫొటోను అభిమానులకు షేర్ చేసింది ఈ 19 ఏళ్ల భామ. అయితే ఆ చిత్ర క్యాప్షన్‌లో 'ఇది ఇన్‌స్టా, ఫేస్బుక్ కోసం ' అంటూ సంస్థ పంపిన పోస్టును అలాగే సామాజిక మాధ్యమంలో పంచుకుంది ప్రియా. నెటిజన్లు ఈ క్యాప్షన్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.
- విపరీతమైన కామెంట్లు వచ్చిన తర్వాత తప్పు సరిదిద్దుకున్నా ప్రయోజనం లేకపోయింది. నెటిజన్లు మాత్రం కాపీపేస్టు అంటూ చలోక్తులు విసురుతున్నారు. ఆమెను అన్ ఫాలో చేసేయండి అని కొందరు, కావాలనే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఒరు అదార్ లవ్‌లో కన్నుగీటి మంచి పాపులర్ అయింది ప్రియా వారియర్. తర్వాత అదే సినిమాలో అదర చుంభనంతోనూ మాయ చేసింది. గత ఏడాది గూగుల్‌లో ఎక్కువమంది వెతికిన సెలబ్రిటీగా పేరు తెచ్చుకుందీ మలయాళీ భామ.