'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్-హీరో అల్లుఅర్జున్ కాంబోలో సినిమా రానుందా? అవుననే తెగ చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు, నెటిజన్లు. ఎందుకంటే బన్నీని తన కార్యాలయంలో ప్రశాంత్ నీల్ కలవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వెంటనే అభిమానులు #A22 పేరుతో ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
'కేజీఎఫ్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన హీరో ప్రభాస్తో 'సలార్' తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో ఓ చిత్రం చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడీ జాబితాలో అల్లుఅర్జున్ చేరిపోయారు.
ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్ 'సలార్' విడుదల తేదీ ఫిక్స్.. రచ్చ రచ్చే