ETV Bharat / sitara

కథ వినకుండానే 'అఖండ' చేశా: హీరోయిన్ ప్రగ్యా - బోయపాటి బాలయ్య మూవీస్

బాలకృష్ణ చాలా పాజిటివ్​ వ్యక్తి అని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చెప్పింది. కథ వినకుండానే 'అఖండ'లో నటించినట్లు తెలిపింది.

pragya jaiswal
ప్రగ్యా జైస్వాల్
author img

By

Published : Nov 27, 2021, 6:32 AM IST

అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్‌ ఒకరు. 'కంచె', 'జయ జానకి నాయక' తదితర చిత్రాలతో ఇదే అంశాన్ని చాటిచెప్పిన ముద్దుగుమ్మ 'అఖండ'తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రగ్యా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

pragya jaiswal
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

నా పాత్రే కీలకం..

ద్వారక క్రియేషన్స్‌ సంస్థలో నేను నటించిన రెండో చిత్రమిది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. తాను రాసుకున్న పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలా నేనీ ప్రాజెక్టులో అడుగుపెట్టాను. ఆయనపై నాకున్న నమ్మకంతో కథను పూర్తిగా వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పా. నేనీ చిత్రంలో ఐఏఎస్‌ శ్రావణ్య అనే పాత్ర పోషించా. దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకు కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా. ఇందుకు ఎంతో శ్రమించా. నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నా. సినిమాకే కీలకంగా నిలిచే పాత్ర అది. ఆ క్యారెక్టర్‌ చుట్టే కథ తిరుగుతుంది. ఆ పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల కథానాయకుడి రెండో క్యారెక్టర్‌ 'అఖండ' దర్శనమిస్తుంది.

పాట కోసం ఎదురుచూస్తున్నా..

'అఖండ'లాంటి కథ, అందులోని పాత్రల్ని నేనింతవరకూ వినలేదు, చూడలేదు. తెలుగులోనే కాదు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఇలాంటి పవర్‌ఫుల్‌ సినిమా వచ్చుండదు. ఇందులోని పాటలు ఇతర కమర్షియల్‌ చిత్రాల్లో ఉన్నట్టుగా ఉండవు. ఈ సినిమా సంగీతంలో వైవిధ్యం ఉంది. వ్యక్తిగతంగా నాకు డ్యాన్స్‌ చేయడమంటే ఇష్టం. ఓ పాటలో నా నృత్య ప్రతిభను చూపించే అవకాశం వచ్చింది. ఆ పాట విడుదల కోసం ఎదురుచూస్తున్నా.

pragya jaiswal
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

ఆయనెంతో పాజిటివ్‌..

బాలకృష్ణ తెల్లవారు జామున 3 గంటలకే నిద్రలేచి 6 గంటల సమయానికి సెట్‌లో ఉంటారు. ఆయన ఎనర్జీ చూసి షాకయ్యేదాన్ని. ఓ సందర్భంలో 'మీరు మనిషేనా?' అని ఆయన్ను సరదాగా అడిగా. ఆయన శక్తిని చూసే బహుశా బోయపాటి శ్రీను అఖండ పాత్ర సృష్టించారేమో! ఈ సినిమాకు ఎంపిక కాకముందే వివిధ సందర్భాల్లో బాలకృష్ణగారిని కలిశా. కానీ, ఆయనతో నటిస్తున్నాననే విషయం తెలియగానే కాస్త భయపడ్డాను. అంత సీనియర్‌ యాక్టర్‌ పక్కన నటించడమంటే సవాలే కదా!! సెట్‌లో అడుగుపెట్టిన రోజే ఆయన నా టెన్షన్‌ పోగొట్టారు. బాలకృష్ణ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. క్రమశిక్షణ, సమయపాలన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌. అలాంటి నటుడితో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది.

pragya jaiswal balakrishna
బాలయ్యతో ప్రగ్యా జైస్వాల్

వారిద్దరూ దూరమే..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. ఇద్దరూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే నేనే ఎక్కువగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాను. ఇదే విషయాన్ని తమన్‌తో చెప్పాను. అలా ఇద్దరం కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. షూటింగ్‌ ప్రారంభంలో జగపతిబాబు సర్‌ను చూసి గుర్తు పట్టలేకపోయా. అలాంటి గెటప్‌లో కనిపించారాయన. తనే నన్ను పిలిచి మాట్లాడారు. జగపతిబాబునే కాదు ప్రతి ఒక్కరినీ బోయపాటి మార్చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.