ETV Bharat / sitara

ప్రభాస్​ కొత్త చిత్రం 'సలార్​' కథాంశం ఇదేనా!

author img

By

Published : Dec 6, 2020, 10:31 PM IST

డార్లింగ్​ ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్​' ఫస్ట్​లుక్​ ఇటీవలే విడుదలైంది. ఈ పోస్టర్​లోని ప్రభాస్​ వైల్డ్​ లుక్​తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

prabhas
ప్రభాస్​ కొత్త చిత్రం 'సలార్​' కథాంశం ఇదేనా!

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రం 'సలార్​'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను చిత్రబృందం ఇటీవలే సోషల్​మీడియాలో విడుదల చేసింది. ఇందులో ప్రభాస్​ గన్​ పట్టుకొని కూర్చున్న లుక్ ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

మరోవైపు ఈ సినిమా బ్యాక్​డ్రాప్​ రివీల్​ అయినట్లు తెలుస్తోంది. రివేంజ్​ డ్రామాగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్​ ఓ పేరుమోసిన గ్యాంగ్​ లీడర్​గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్... ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. 'సలార్​' చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:'ఆదిపురుష్​' వివాదంపై సైఫ్ క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.