ETV Bharat / sitara

ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదల ఎప్పుడంటే?

author img

By

Published : Jan 21, 2021, 3:51 PM IST

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ సినిమా విడుదల తేదీపై టాలీవుడ్​లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు నటుడు, నిర్మాత కృష్ణంరాజు.

Radheshyam
రాధేశ్యామ్

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత కృష్ణంరాజు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భారీ బడ్జెట్‌తో 'రాధేశ్యామ్‌' పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్‌ ఖడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్‌ రాయ్‌ కపూర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: సోనూసూద్​ పిటిషన్​ను తిరస్కరించిన బాంబే హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.