ETV Bharat / sitara

ప్రభాస్ అందుకే నా​ సినిమా ఒప్పుకున్నారు: నాగ్​ అశ్విన్​ - ప్రభాస్​ తో తెరకెక్కించనున్న సినిమాపై నాగ్​ అశ్విన్​ స్పష్టం

ప్రభాస్​తో తాను తీసే సినిమా సైన్స్​ ఫిక్షన్​ నేపథ్యంలో ఉంటుందని చెప్పాడు దర్శకుడు నాగ్​ అశ్విన్​. వీటితో పాటే బోలెడు విషయాల్ని పంచుకున్నాడు.

prabhas_
ప్రభాస్ అందుకే నా​ సినిమా ఒప్పుకున్నారు: నాగ్​ అశ్విన్​
author img

By

Published : Feb 29, 2020, 9:46 PM IST

Updated : Mar 3, 2020, 12:12 AM IST

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ తర్వాత చేయబోయే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. వైజయంతీ మూవీస్​ పతాకంపై నాగ్​ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు​. అయితే ఓ ట్రైలర్​ విడుదల కార్యక్రమానికి వచ్చిన ఈ డైరక్టర్.. డార్లింగ్ హీరో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చెప్పాడు.

సైన్స్​ ఫిక్షన్​ కథతో ఈ సినిమా తీయనున్నామని, ఈ ఏడాది చివర్లో షూటింగ్​ ప్రారంభించబోతున్నమన్నాడు నాగ్ అశ్విన్. ప్రీ ప్రొడక్షన్స్ కోసం దాదాపు పది నెలలు పనిచేయబోతున్నమని చెప్పాడు. వచ్చే ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ కథలో ప్రభాస్ తనను తాను చూసుకున్నాడని, అందుకే ఒప్పుకున్నారని అన్నాడు నాగ్ అశ్విన్.

ప్ర‌స్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్. 1930ల నాటి ప్రేమకథతో తీస్తున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి : హాలీవుడ్​లో హృతిక్​ రోషన్​ అరంగేట్రం

Last Updated : Mar 3, 2020, 12:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.