ETV Bharat / sitara

Prabhas Project K: 'ఆ రోజు నుంచే రెగ్యులర్​ షూటింగ్​' - ప్రాజెక్ట్​ కె చిత్రం

ప్రభాస్, నాగ్​ అశ్విన్(Nag Ashwin Prabhas).. పాన్ ఇండియా చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబరు నుంచి ప్రారంభం కానుందని ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించామన్నారు.

Prabhas
ప్రభాస్​
author img

By

Published : Sep 21, 2021, 7:32 AM IST

ఓవైపు 'ఆదిపురుష్‌', 'సలార్‌' చిత్రాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin Prabhas) కొత్త సినిమాపైనా దృష్టి సారిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్‌ కే'(Prabhas Project K) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇప్పటికే పట్టాలెక్కింది. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సోషియో ఫాంటసీగా మూవీగా(Nag Ashwin Upcoming Movie With Prabhas) రూపొందనుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొణె నాయికగా నటిస్తోంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. ఆయన ఈ సినిమా చిత్రీకరణ వివరాలను ఈటీవీలో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఈ చిత్రం కోసం ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ((Prabhas Project K) ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి దాదాపు 13నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ కొనసాగిస్తాం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, అమితాబ్‌లతో పాటు మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇప్పటికే గ్రాఫిక్స్‌ పనులు ప్రారంభమయ్యాయి" అని అశ్వినీదత్‌ తెలిపారు.

ఇదీ చదవండి: వామ్మో! బిగ్‌బాస్‌కు సల్మాన్‌ పారితోషికం అంతనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.