'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ నటించాలి. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తోనూ కలిసి పనిచేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఓ మహిళా దర్శకురాలితో సినిమా చేయనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

'ఆకాశం నీ హద్దురా!'తో ప్రేక్షకుల మనసు గెల్చుకున్న సుధా కొంగర.. ప్రభాస్‌కు ఓ స్టోరీ చెప్పారని, అది డార్లింగ్‌కు కూడా నచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.