యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగుల్లో బిజీగా గడుపుతున్నారు. ముంబయిలో 'ఆదిపురుష్' చిత్రీకరణలో పాల్గొంటున్నారాయన. మరోపక్క హైదరాబాద్‌లో 'సలార్' కోసం ప్రత్యేకంగా సెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రామగుండం పరిసరాల్లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది 'సలార్' చిత్రం.
వచ్చే నెలలో 'సలార్' కొత్త షెడ్యూల్ షురూ కానుంది. హైదరాబాద్ శివార్లలో తీర్చిదిద్దుతున్న సెట్స్‌లోనే ఆ షెడ్యూల్ జరగనుంది. మరోపక్క ప్రభాస్-నాగ్‌అశ్విన్ కలయికలో సినిమా కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. సింహభాగం సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఇదీ చూడండి: విక్రమ్ వేద: అప్పుడేమో ఆమిర్.. ఇప్పుడేమో సైఫ్!