'బాహుబలి', 'సాహో' తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది చిత్రబృందం.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' అంటూ ఈ పోస్ట్‌ర్‌కు పేరు పెట్టారు. అంటే మ్యూజిక్‌తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.
ఇదీ చూడండి నిఖిల్ '18 పేజెస్' మొదలైంది