ఇండియాలో బెస్ట్ వెబ్ సిరీస్‌గా గుర్తింపు దక్కించుకుంది 'ఫ్యామిలీ మ్యాన్' (The Family Man). దానికి కొనసాగింపుగా రెండో సీజన్ (The Family Man Season 2) గురువారు అర్ధరాత్రి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో విడుదలైంది. ఈ సిరీస్ ఇంతలా విజయం సాధించడం వెనక ఆ పాత్రల తీరుతెన్ను కూడా ఓ కారణమే. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో మొదటి సీజన్‌ను రక్తి కట్టించారు దర్శకద్వయం రాజ్-డీకే. అందులో వారు రాసుకున్న పాత్రలు వెబ్‌సిరీస్‌కు అదనపు బలాన్ని చేకూర్చాయి. అయితే రెండో సీజన్ మాత్రం మరింత ఆసక్తి రేపింది. అందుకు కారణం సమంత అక్కినేని (Samantha Akkineni).
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన 'ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' విడుదలైంది. ఇందులో సమంత పాత్రను ఎప్పుడుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్‌కు ఇదొక సర్ప్రైజ్ ప్యాకేజ్‌లా అనిపించింది. ఇప్పటికే ఈ సీజన్‌ను చూసిన చాలామంది చెబుతున్న మాట ఇది. శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpai) నటన అద్భుతమని.. సామ్ పాత్ర ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పుకొంటున్నారు. దీంతో విడుదలైన కాస్త సమయంలోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోందీ సిరీస్.
సీజన్ 1 ముంబయి నేపథ్యంగా సాగిన ఈ సిరీస్ సీజన్ 2లో చెన్నైకి వెళ్లింది. శ్రీలంక తమిళ రెబల్స్‌తో మనోజ్ బాజ్‌పాయ్ పోరాటం అద్భుతంగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ రెబల్ గ్రూప్‌ను లీడ్ చేసింది ఎవరో కాదు.. సమంత అక్కినేని. రా, ఇంటెన్సివ్ లుక్‌తో సామ్ అదరగొట్టిందని చెప్పొచ్చు. అలాగే మనోజ్ భార్యగా ప్రియమణి (Priyamani) తన అందంతో ఆకట్టుకుంది. మనోజ్ సహోద్యోగి జేకే తల్పడే మరోసారి తన ప్రదర్శనతో మెప్పించాడు. ఈ షోను తెరకెక్కించిన విధానంపై దర్శకద్వయం రాజ్, డీకేలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యా వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, భాషా భేదాలపై ప్రస్తావలతో సామాజిక సందేశాన్ని ఇచ్చిందీ సీజన్. మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో మనోజ్, సామ్ పోటాపోటీగా నటింటి ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">