పాప్ సంగీతంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న జస్టిన్ బీబర్... ఓ ఇంటివాడయ్యాడు. గత ఏడాది అమెరికా మోడల్ హెయిలీ బల్డ్విన్ను పెళ్లి చేసుకున్న ఈ యువ గాయకుడు.. మరోసారి ఆమెనే వివాహం చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.
గతేడాది సెప్టెంబర్ 13న బల్డ్విన్ను రహస్యంగా న్యూయర్క్ సిటీలోని కోర్ట్ హౌస్‌లో రిజిస్టర్ తొలిసారి వివాహం చేసుకుంది బీబర్-బల్డ్విన్ జంట. తాజాగా సెప్టెంబర్ 30న దక్షిణ కరోలినాలోని పాల్మెట్టో బ్లఫ్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఈ కార్యక్రమానికి 154 మంది ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఇందులో గ్రామీ విన్నర్ డేనియల్ సీజర్ ఓ ప్రదర్శన చేసినట్లు సమాచారం.
"గత సోమవారం నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు" అని బల్డ్విన్ ఫొటోలు పంచుకోగా... "దుండగులకు కూడా పెళ్లవుతుంది" అని సందేశం పెట్టాడు బీబర్.
హెయిలీ పెళ్లి దుస్తులను తయారు చేసింది అమెరికా ఫ్యాషన్ డిజైనర్ విర్గిల్. దానిపై "చావు వరకు ఇద్దరం కలిసే ఉంటాం" అనే సందేశంతో దాన్ని రూపొందించింది.
పాపం సెలీనా గోమెజ్...
గతంలో చాలా ఏళ్లు సహా గాయని సెలీనా గోమెజ్‌తో ఘాటైన ప్రేమలో మునిగితేలాడు బీబర్. తర్వాత బల్డ్విన్కు దగ్గరవడం సహించలేకపోయిన 26 ఏళ్ల సెలీనా.. 68 ఏళ్ల సహా నటుడు బిల్ ముర్రేతో పెళ్లికి ఓకే చెప్పేసింది.