బాలీవుడ్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే.. నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై క్రిమినల్ కేసు పెట్టింది. అతడి వల్ల గత కొద్ది నెలల నుంచి మానసిక క్షోభకు గురవతున్నానని పేర్కొంది.
గతంలో పూనమ్.. ఓ మొబైల్ యాప్ కోసం రాజ్ కుంద్రా భాగస్వామిగా ఉన్న ఆర్మ్స్ ప్రైమ్ మీడియాను సంప్రదించింది. అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నుంచి తనకు అదే పనిగా, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పిందీ భామ.
ఆ తర్వాత రాజ్‌కు సహాయకుడు అయిన సౌరభ్ కుశ్వాను సంప్రదించి, ఈ వేధింపులు ఆపాలని కోరినట్లు పూనమ్ చెప్పింది. అది తగ్గకపోగా, తనకు ఫోన్లు రావడం ఇంకా ఎక్కువయ్యాయని ఫిర్యాదులో పేర్కొందీ భామ.
ఈ విషయంపై రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. పూనమ్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండించాడు. సదరు కంపెనీలో తన వాటాను ఎప్పుడో అమ్మేశానని అన్నాడు. ఈ ఒప్పందం రద్దయిన తర్వాత పూనమ్‌తో సౌరభ్ సంప్రదింపులు జరపడం ఆపేశాడని చెప్పాడు.