ETV Bharat / sitara

'నాతో ఆ దర్శకుడు దారుణంగా మాట్లాడాడు' - పూనమ్ కౌర్ తాజా వార్తలు

మానసిక ఒత్తిడితో బాధపడుతూ గతంలో ఓ దర్శకుడిని సూచనలు అడగ్గా, నువ్వు చనిపోతే ఒక్కరోజు న్యూస్ అవుతావని తనతో ఆయన అన్నట్లు నటి పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

'నాతో ఆ దర్శకుడు దారుణంగా మాట్లాడాడు'
నటి పూనమ్ కౌర్
author img

By

Published : Jun 17, 2020, 6:19 PM IST

గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని టాలీవుడ్‌ నటి పూనమ్‌కౌర్‌ చెప్పింది. దీనిని అధిగమించేందుకు ఓ దర్శకుడిని సూచనలు అడిగితే.. ఆయన దారుణంగా మాట్లాడారని గుర్తు చేసుకుని వరుస ట్వీట్లు చేసి, పరోక్షంగా డైరెక్టర్​ను విమర్శించింది. హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో గతంలోని ఈ ఘటనను గుర్తు చేసుకుంది పూనమ్.

Poonam Kaur makes shocking comments tollywood director
నటి పూనమ్ కౌర్ ట్వీట్లు

'నా మానసిక పరిస్థితి బాగాలేదు.. ఏం చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. నాతో కాసేపు మాట్లాడండి? అని ఓ దర్శకుడిని అడిగా. అయితే ఆయన నాతో సరిగా వ్యవహరించలేదు. పైగా.. ఏమీ జరగదు.. నువ్వు చనిపోతే ఒక్క రోజు న్యూస్‌ అవుతావ్‌ అని ఆ దర్శకుడు ఎగతాళిగా అన్నాడు. ఆ మాటలు నాకు విరక్తి తెప్పించాయి. ఆ దర్శకుడు ఎన్నో రంగాల్ని కంట్రోల్‌ చేస్తున్నాడు. పరోక్షమైన ఆర్టికల్స్‌ ద్వారా ఆయన నాతో మాట్లాడిన తీరు ఇంకా బాధించింది. మీడియా రాసిన అనవసరమైన వార్తలు నాలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. నేను నేరుగా అతడికి సమాధానం ఇచ్చా. నేనెందుకు ఇలా ఉండాలి అనుకున్నా. మారేందుకు ప్రయత్నిస్తున్నా

'నువ్వు(దర్శకుడు) నిశ్శబ్దంగా నన్ను సినిమాల నుంచి నిషేధించావు. ఫర్వాలేదు.. నువ్వు గురూజీవి కాదు. స్వలాభం కోసం నీ స్నేహితుల్ని కూడా మభ్యపెడుతూ జీవిస్తున్నావు. నీ వల్ల లాభం పొందిన వారు నాకు తెలిసి ఎవరూ లేరు. నీ అసలు రంగు చూసి.. షాక్‌ అయ్యా. నేను ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ ఇప్పటికీ నాకు షాక్‌లు ఇస్తూనే ఉన్నావు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌లా నేనూ ఫీల్‌ అయ్యేలా చేస్తున్నావు. కానీ అలా నా జీవితాన్ని ముగించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికీ థెరపీ తీసుకుంటున్నా' అని పూనమ్ వరుస ట్వీట్లలో రాసుకొచ్చింది. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.