ETV Bharat / sitara

'ఆచార్య'లో సందడి చేయనున్న 'జిగేల్​ రాణి'! - ఆచార్యలో పూజా హెగ్డే

మెగాస్టార్​ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్​చరణ్​ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా నటించేందుకు చిత్రబృందం పూజాహెగ్డేను సంప్రదించిందని సమాచారం.

Pooja Hegde Team Up With Charan For Acharya
'ఆచార్య'లో సందడి చేయనున్న 'జిగేల్​ రాణి'!
author img

By

Published : Dec 25, 2020, 11:18 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే సైతం సందడి చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూజా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారట. అది కూడా రామ్‌చరణ్‌ లవర్‌గా. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించిందని తెలుస్తోంది. 'ఆచార్య'లో నటించేందుకు ఆమె ఎంతో ఆసక్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Pooja Hegde Team Up With Charan For Acharya
పూజాహెగ్డే

'అల.. వైకుంఠపురములో..' విజయం తర్వాత పూజాహెగ్డే ప్రస్తుతం 'రాధేశ్యామ్‌', 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌' చిత్రీకరణలతో బిజీగా ఉంది. మరోవైపు చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే చెర్రీ-పూజా కలిసి 'రంగస్థలం'లోని 'జిగేలు రాణి' పాట కోసం ఆడిపాడారు.

ఇదీ చూడండి: 'సెల్ఫీలు అడుగుతుంటే ఇబ్బందిగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.