ETV Bharat / sitara

'ప్రభాస్, సమంతతో గొడవలు'.. గుట్టు విప్పిన పూజ! - పూజా కామెంట్స్​

Pooja Hegde Prabhas: స్టార్​ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్​ పూజాహెగ్డే. ఇటీవలే ప్రభాస్​తో నటించిన రాధేశ్యామ్​ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్​డ్​​ టాక్​ సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్​, సమంతతో పూజాకు ఏవో భేదాభిప్రాయాలు వచ్చాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వాటిపై స్పందించిన పూజా ఏమందంటే?

poojaprabhassamantha
pooja hegde
author img

By

Published : Mar 25, 2022, 4:31 PM IST

Pooja Hegde Prabhas: కెరీర్​లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది స్టార్​ హీరోయిన్​ పూజాహెగ్డే. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్‌ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ చిత్ర షూటింగ్​లో హీరో ప్రభాస్‌తో భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రభాస్‌తో మాత్రమే కాకుండా సమంతతో కూడా విభేదాలున్నట్లు నెటిజన్లు మాట్లాడుకున్నారు. వీటిన్నంటిపై పూజ స్పందించింది.

"సోషల్​మీడియాలో అలాంటి పుకార్లు వచ్చినప్పటికీ ..సెట్స్​లో మా మధ్య ఏం జరగలేదు. నాకు, ప్రభాస్​కు ఎలాంటి విభేదాలు లేవు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి నేనేం చేయలేను. నా సోషల్​ మీడియా హ్యాండిళ్లలో ఎప్పుడూ మంచి విషయాల కోసమే పోస్టులు ఉంటాయి. అలాంటి పుకార్లను నేను పట్టించుకోను"

  • --పూజా హెగ్డే, హీరోయిన్​

ఇంతకుముందు కూడా పూజా, ప్రభాస్ మధ్య సెట్స్​లో ఏదో ఒక సందర్భంలో విభేదాలు వచ్చాయని పుకార్లు వస్తే యూవీ క్రియేషన్స్​ కొట్టిపడేసింది. ప్రభాస్​, పూజా ఒకరినొకరు గౌరవించుకుంటారని చెప్పింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి పూజాహెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమాను జాతకాలు, విధిరాత నేపథ్యంలో రూపొందించారు. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించగా, ఆయన ప్రేయసి ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే ఆకట్టుకుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కస్‌లో పూజ కనిపించనుంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సరసన నటిస్తోంది.

ఇదీ చదవండి: RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.