ETV Bharat / sitara

సల్మాన్​తో సినిమాపై పూజ రియాక్షన్ - కబీ ఈద్ కబీ దివాలీ

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​ సరసన నటించే అవకాశం కొట్టేసింది నటి పూజా హెగ్డే. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకావాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఆలస్యమయ్యేట్లు ఉంది. తాజాగా సల్మాన్​తో నటించే ఛాన్స్ రావడంపై స్పందించింది పూజ.

పూజ
పూజ
author img

By

Published : Apr 13, 2020, 10:48 AM IST

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌తో సినిమా గురించి నటి పూజా హెగ్డే స్పందించింది. త్వరలో ఆమె సల్మాన్‌తో కలిసి 'కబీ ఈద్‌ కబీ దివాలీ' చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజాను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేయగా.. సల్మాన్‌తో నటించాల్సి ఉన్న సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

"సల్మాన్‌ ఖాన్‌తో పనిచేయడమంటే మనలోని టాలెంట్‌కు ఇంకొంచెం మెరుగులద్దుకోవాలని అర్థం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమాల్లో ఉన్నారు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. అందువల్లే నేను కొంచెం భయపడుతున్నా. అగ్ర నటీనటులతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. కానీ ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. ఈ కథ చాలా కూల్‌, ఫన్నీగా ఉంటుంది. ఆగస్టు నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రీషెడ్యూల్‌ చేయాలని భావిస్తున్నారు."

-పూజా హెగ్డే, హీరోయిన్

హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన 'మొహంజోదారో' చిత్రంతో పూజ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్‌ 4' చిత్రంతో బాలీవుడ్‌లో పూజ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.